ఎంతో ఓపిగ్గా ఆడిన పంత్ కూడా అవుట్... ధోనీ, హార్దిక్ పైనే భారం!

  • 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • స్కోరు 28 ఓవర్లలో 83 రన్స్
  • చేయాల్సిన పరుగులు 22 ఓవర్లలో 157
మాంచెస్టర్ సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పరిస్థితి ఏమీ బాగాలేదు. 240 పరుగుల లక్ష్యం ఆడుతూ పాడుతూ ఛేదిస్తారనుకుంటే పరుగుల సంగతి పక్కనబెడితే వికెట్లు కాపాడుకోవడమే గగనమైపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశకు గురిచేశారు. పోరాడతాడనుకున్న దినేశ్ కార్తీక్ చేతులెత్తేశాడు.

ఇక కొండంత ఓపికతో కివీస్ బౌలర్లను ఎదుర్కొంటూ విజయంపై ఆశలు కలిగించిన పంత్ కూడా ఐదో వికెట్ రూపంలో అవుటయ్యాడు. స్పిన్నర్ శాంట్నర్ టీమిండియా ఆశలకు విఘాతం కలిగిస్తూ పంత్ ను బుట్టలో వేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 28 ఓవర్లలో 5 వికెట్లకు 83 పరుగులు. క్రీజులో హార్దిక్ పాండ్యా, ధోనీ ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 22 ఓవర్లలో 157 పరుగులు చేయాల్సి ఉండగా, భారమంతా ధోనీ, హార్దిక్ పైనే ఉంది.
Go Back to Shorts
India
New Zealand

More Telugu News